విజయవాడ: అందరినీ కలుపుకొని వెళ్లి తెలుగుదేశం పార్టీని జిల్లాలో మరింత బలంగా నిలబెడతానని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పార్టీలో జిల్లాలో ఏ నేతలతో విభేదాలు లేకుండా చూసుకుంటానని చెప్పారు. అందరినీ కలుపుకొని వెళతానని చెప్పారు. జిల్లాలో ఎక్కడా గ్రూపులు లేవని అన్నారు. అందరూ కలిసి కట్టుగానే ఉన్నారని చెప్పారు. తన వద్ద నుండి ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటానని చెప్పారు.
కాగా మంగళవారం టిడిపి కృష్ణా జిల్లా అర్బన్ నేత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలిసి తన రాజీనామాపై వివరణ ఇచ్చిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా బాబు వంశీని మందలించినట్లు కూడా తెలుస్తోంది. అందుకే ఆ తర్వాత వంశీ వెనక్కి తగ్గి తానే తొందర పడ్డానని అందుకు చంద్రబాబుకు క్షమాపణలు చెప్పానని చెప్పారు. ఈ నేపథ్యంలో వంశీ వెనక్కి తగ్గడంతో దేవినేని కూడా చంద్రబాబు సూచన మేరకు తప్పులు ఉంటే సరిదిద్దుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.