పురందేశ్వరి అదృశ్య శక్తి, జగన్ ప్రాజెక్టులో హసన్ అలీ డబ్బు!: టిడిపి
Districts
oi-Srinivas G
By Srinivas
|
విజయవాడ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో సంక్షోభాలకు కేంద్రమంత్రి పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారని కృష్ణా జిల్లా టిడిపి ఇన్‌ఛార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం ఆరోపించారు. టిడిపిలో సంక్షోభానికి పురందేశ్వరి అదృశ్య శక్తి అని ఆరోపించారు. పురందేశ్వరి టిడిపిని విచ్ఛిన్నం చేసే ఆలోచనలు మానుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా వివాదం టీకప్పులో తుఫాను వంటిదని చెప్పారు. అది ముగిసి పోయిందన్నారు. వల్లభనేని వంశీ, దేవినేని ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమ కలిసి పని చేయడానికి అంగీకరించారని చెప్పారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అని చెప్పారు.
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సండూరు పవర్ ప్రాజెక్టుకు నల్ల కుబేరుడు హసన్ అలీ నుండి 125 కోట్లు అందాయని హైదరాబాదులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య ఆరోపించారు. యుపిఏ ప్రభుత్వం జగన్‌పై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తుందని అన్నారు. మధుకొడాకు ఓ న్యాయం, రాజాకు ఓ న్యాయం జగన్‌కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో జగన్ అవినీతి సొమ్ముతో బరిలోకి దిగుతున్నారని ఆరోపించారు.
krishna district TDP in charge accused that central minister Purandeswari hand in TDP crisis. He said Devineni and Vallabhaneni will go with co-operation.
Story first published: Wednesday, April 13, 2011, 15:37 [IST]