వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం, ఓటేసిన జయలలిత, విజయకాంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Polling
న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. తమిళనాడులో 234 నియోజక వర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అవినీతి, కుటుంబ పాలన ప్రధాన ప్రచారాస్ర్తాలుగా అన్నాడియంకె, అభివృద్ధి మంత్రంతో డీఎంకేలు ఎన్నికల బరిలోకి దిగాయి. 2,773 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. వారిలో 136మంది మహిళలు ఉన్నారు. అన్నాడియంకె నేత జయలలిత, సినీ నటుడు విజయకాంత్ బుధవారం ఉదయం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ కూటమిదే విజయమని ఆమె దీమా వ్యక్తం చేశారు.

ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లు ప్రధానంగా పోటీ పడుతున్న మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ 971 మంది బరిలో ఉన్నారు. వారిలో అత్యధికులు ఇండిపెండెంట్లే. మొత్తం ఓటర్ల సంఖ్య 2.31 కోట్లు ఉండగా 2118 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు గానూ 187 మంది పోటీలో ఉన్నారు. అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8.1 లక్షలు. 867 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ 17, డీఎంకే 10, ఆల్‌ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ 17, ఏఐఏడీఎంకే 10 స్థానాల్లో బరిలో ఉన్నాయి. పోటీలో ఉన్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వైతిలింగం, ఆయన మంత్రివర్గ సహచరులు, అసెంబ్లీ స్పీకర్ ఆర్ రాధాకృష్ణన్, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి తదితరులున్నారు.

English summary
Polling in Tamil Nadu, Kerala and Puducherry began on Wednesday amid unprecedented security to elect their new assemblies in one of the closest battles that witnessed a bitter race between rival fronts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X