జగన్ ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాడు: టిజి, నారాయణ వ్యాఖ్యలపై బొత్స గుర్రు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆకాశానికి నిచ్చెన వేయాలని చూస్తున్నారని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం కడప జిల్లాలో వ్యాఖ్యానించారు. తన ఆస్తులను రక్షించుకోవడానికి ముఖ్యమంత్రి కావడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆయన ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రి అని అన్నారు. కాగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై జగన్ విమర్శలు చేయడం ఆయన అహంబావానికి నిదర్శనమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హైదరాబాదులో ఆరోపించారు. ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో జగన్ ఉప ఎన్నికల భారాన్ని మోపారన్నారు. ఎలాంటి ఉద్యమాలు చేయకుండా ఎంపీ అయిన జగన్‌కు సోనియాను విమర్శించే అర్హత లేదన్నారు.
కాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మంత్రులను కుక్కల్లా కడపలో తిరుగుతున్నారన్న వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో ఖండించారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. స్కాలర్‌షిప్‌లపై ప్రభుత్వ పర విధాన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపకార వేతనాల విషయంలో ఆందోళన చెందవద్దని కోరారు.
Botsa condemned CPI state secretory Narayana comments on minister today. He confirmed students on Scholarships. Minister TG Venkatesh fired at ex MP YS Jaganmohan Reddy.
Story first published: Wednesday, April 13, 2011, 15:08 [IST]