కమలమ్మ సీరియల్: చర్చలు విఫలం, జగన్‌కు మళ్లీ ఝలక్

బద్వేలు నియోజకవర్గంలో గోవిందరెడ్డి ఆధిపత్యం కొనసాగిస్తూ తనను ప్రతి విషయంలో అడ్డుకుంటున్నారని కమలమ్మ జగన్‌కు ఫిర్యాదు చేశారని, జగన్ ఆమె మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదని, గోవింద రెడ్డితో కలిసి పనిచేయాలని సూచించారని, దీంతో కమలమ్మ మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. జగన్ తన మాటలు వినిపించుకోకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగడం మంచిది కాదని ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తనకు వైయస్సార్ కాంగ్రెసు నుంచి టికెట్ దొరకడం కూడా కష్టమని, అంతా గోవింద రెడ్డే అవుతారని ఆమె భావించి తిరిగి కాంగ్రెసులోకి రావడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆమెను కాంగ్రెసులోకి తీసుకురావడానికి శివరామకృష్ణయ్య చర్చలు జరిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications