కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే కమలమ్మ, క్షోభ పెడుతున్నారని ఆవేదన

వైయస్సార్ కాంగ్రెసులో తనకు విలువ లేదని, అందుకే ఆ పార్టీలో చేరడానికి తాను ఇష్టపడడం లేదని ఆమె చెప్పారు. వైయస్ జగన్‌తో చర్చలు విఫలమైన తర్వాత ఆమె నియోజకవర్గం కార్యకర్తలతో మాట్లాడారు. ప్రాధాన్యం ఉన్న కాంగ్రెసులోనే కొనసాగాలని కార్యకర్తలు సూచించినట్లు ఆమె తెలిపారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి కమలమ్మతో గురువారంనాడు కూడా చర్చలు జరిపారు. కానీ ఆమె వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి ఇష్టపడలేదు. కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని కమలమ్మ చెప్పారు.












Click it and Unblock the Notifications