చంద్రబాబుకు మరో తలనొప్పి: స్పష్టమైన ప్రకటనకు నాగం సవాల్

మే 9వ తేదీన నుంచి ఆయన తెలంగాణ సాధన యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. మే 9వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నుంచి తన యాత్రను ప్రారంభిస్తానని, తనను దూషించినవారిపై నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభలో ఏ విధమైన విమర్సలు చేయబోనని ఆయన చెప్పారు. యాత్రను తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తానని, తెలంగాణలోని అన్ని జిల్లాలు పర్యటిస్తానని ఆయన చెప్పారు. మిగతా తెలంగాణ ప్రాంత నాయకులు కూడా తనతో కలిసి రావాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలంతా తాను తలపెట్టిన యాత్రలో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications