శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి తమకు నివేదిక సమర్పించాలని నాంపల్లి కోర్టు హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులను ఆదేశించింది. శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై 418, 153ఎ, 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని రెహ్మాన్ కోర్టును కోరారు. ముస్లింలకు, హిందువులకు మధ్య తగాదాలు పెంచే విధంగా కూడా నివేదిక ఉందని ఆయన ఆరోపించారు. శ్రీకృష్ణతో పాటు కమిటీ సభ్యులను అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications