కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల్లో డమ్మీలు: ఐదుగురు జగన్‌లు, ముగ్గురు విజయమ్మలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
కడప‌: కడప లోకసభకు, పులివెందుల శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో డమ్మీల నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ పడుతున్న వైయస్ జగన్, వైయస్ విజయమ్మల పేర్ల మీద స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ పేరున్న ఐదుగురు కడప లోకసభ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయగా, విజయమ్మ పేర్లున్న ముగ్గురు పులివెందుల శాసనసభా స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి మరో రెండు రోజుల గడువు ఉంది. ఈ రెండు రోజుల్లో మరింత మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఓటర్లను తికమక పెట్టి ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి కాంగ్రెసు నాయకత్వం పన్నిన వ్యూహంలో భాగంగా జగన్, విజయమ్మల పేర్లున్నవారు నామినేషన్లు దాఖలు చేస్తున్నారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కామన్ సింబల్ రాకపోవడంతో వైయస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి డమ్మీల చేత నామినేషన్లు వేయించడం ద్వారా కొంత మేరకు లబ్ధి పొందవచ్చునని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి రోజుకు ఇద్దరు చెప్పిన విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి పేర్లున్నవారు డమ్మీలుగా నామినేషన్లు వేస్తున్నారు.

English summary
Dummies with the names of Jaganmohan Reddy and Vijayamma are filing nominations for Kadapa loksabha seat and Pulivendula assembly sear respectively. It is said that to confuse voters, congress has resorted to this act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X