ఒకేసారి వైయస్ విజయమ్మ, వైయస్ వివేకానంద రెడ్డి నామినేషన్లు

పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. భారీ వూరేగింపుతో కుమారుడు జగన్ వెంటరాగా ఆమె తహశీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. అనంతరం ఆమె రెండుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలుచేశారు. తన ఆస్తుల విలువను 2.07 కోట్ల రూపాయలుగా ఆమె తన అఫిడవిట్‌లో తెలిపారు.
కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న డీఎల్ రవీంద్రారెడ్డి కూడా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి సాయిప్రతాప్, రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, అహ్మదుల్లా హాజరయ్యారు. కడప లోకసభ స్థానంలో విజయం తనదేనని డిఎల్ రవీంద్రా రెడ్డి దీమా వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా వైయస్ జగన్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications