వైయస్ జగన్‌తో కలిసి బిజెపి రాష్ట్రంలో కుట్ర చేస్తోంది: డి. శ్రీనివాస్

కడప, పులివెందుల ఉప ఎన్నికల వెనక జగన్‌తో కలిసి బిజెపి కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కర్ణాటక మంత్రి, బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై జగన్ విమర్శలు చేయడం వెనక బిజెపి ఉందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కేంద్రంలో ఏ పార్టీకి మద్దతిస్తారని ఆయన అడిగారు. జగన్ కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎతో ఉంటారా, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయెతో ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్న తృతీయ ఫ్రంట్‌లో ఉంటారా అని ఆయన అడిగారు.
సందర్భం వచ్చినప్పుడు బిజెపికి, వైయస్ జగన్‌కు మధ్య గల సంబంధాలను బయటపెడతానని ఆయన చెప్పారు. వైయస్ జగన్ అక్రమాస్తులపై ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. జగన్ వర్గం శాసనసభ్యులు తాము కాంగ్రెసు శాసనసభ్యులమని చెప్పుకునే ఆర్హతను కోల్పోయారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ గెలిస్తే బిజెపి మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.