వారసత్వ పోరు మీడియా సృష్టి, వివాదం వారే పరిష్కరించాలి: బాలకృష్ణ

చంద్రబాబు నాయకత్వంలో టిడిపి మళ్లీ అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. మరోసారి చంద్రబాబు సిఎం కావాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా విజయవాడ టిడిపిలో విభేదాలు సద్దుమణిగినట్లుగా కనిపించడం లేదు. బుధవారం భవానీపురంలో జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకలకు దేవినేని ఉమ, వల్లభనేని వంశీ ఇద్దరూ మొదటి సారి ఒకే వేదికపై పాలు పంచుకుంటారని టిడిపి కార్యకర్తలు భావించారు. కానీ వంశీ మాత్రం వ్యక్తిగత పని ఒత్తిడి కారణంగా రాలేక పోతున్నట్టుగా చెప్పారు.