దసరా, సంక్రాంతి సెలవులు లిస్ట్ వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ఇదే

తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం (స్కూల్స్ రీఓపెనింగ్) తేదీలో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీనే స్కూళ్లు తెరవాల్సి ఉన్నప్పటికీ, విద్యార్థుల సౌకర్యార్థం ఈ తేదీని జూన్ 15కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 12న స్కూళ్లు తెరిచినప్పటికీ.. ఆ మరుసటి రోజు జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం కావడంతో వరుసగా సెలవులు వచ్చాయి.

కేవలం ఒక్క రోజు కోసం స్కూల్ తెరిచి, మళ్లీ రెండు రోజులు సెలవులు ఇవ్వడం కంటే.. నేరుగా సోమవారం (జూన్ 15) నుంచే క్లాసులు ప్రారంభించడం బాగుంటుందని విద్యాశాఖ భావించింది. జూన్ 12న అదనంగా ఇచ్చిన సెలవు వల్ల విద్యా సంవత్సరం దెబ్బతినకుండా ఉండేందుకు.. దానికి ప్రత్యామ్నాయంగా వచ్చే నెల జులై 11న (రెండో శనివారం) పాఠశాలలను యథాతథంగా నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.'

Telangana school Academic calendar 2026-27 Out Check Dussehra Sankranti and Summer Vacation Schedule
మళ్లీ సెలవులు, స్కూల్స్ రీఓపెనింగ్ కొత్త డేట్ ఇదే!
మళ్లీ సెలవులు, స్కూల్స్ రీఓపెనింగ్ కొత్త డేట్ ఇదే!

2026-27 విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల

ఇదే సమయంలో వచ్చే విద్యాసంవత్సరానికి (2026-27) సంబంధించిన పూర్తి అకడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ క్యాలెండర్ ప్రకారం ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

  • మొత్తం పనిదినాలు: ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లకు మొత్తం 227 వర్కింగ్ డేస్ ఉంటాయి.
  • సిలబస్ గడువు: 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28, 2027 లోగా సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయాలని విద్యాశాఖ గడువు విధించింది.
  • దసరా సెలవులు: ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు (మొత్తం 13 రోజులు) దసరా పండుగ సెలవులు ఉంటాయి.
జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • సంక్రాంతి సెలవులు: వచ్చే ఏడాది జనవరి 13 నుంచి జనవరి 17 వరకు (మొత్తం 5 రోజులు) సంక్రాంతి సెలవులుగా ప్రకటించారు.
  • ఆఖరి పనిదినం & వేసవి సెలవులు: 2027 ఏప్రిల్ 23వ తేదీని ఈ విద్యాసంవత్సరపు ఆఖరి వర్కింగ్ డేగా నిర్ణయించారు. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి జూన్ 13, 2027 వరకు బడులకు వేసవి సెలవులు (సమ్మర్ హాలిడేస్) ఉంటాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+