హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిట్టిన చిరంజీవిని చేర్చుకున్నప్పుడే కాంగ్రెసు...: కొండా సురేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: తిట్టిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిని చేర్చుకున్నప్పుడే కాంగ్రెసు తనపై తాను వేటు వేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. తమపై అనర్హత వేటు వేస్తారని వచ్చిన వార్తలపై ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కాంగ్రెసుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తమపై అనర్హత వేటు వేసే హక్కు కాంగ్రెసు పార్టీకి లేదని ఆమె అన్నారు. అనర్హత వేటుకు భయపడేది లేదని, తాను వైయస్ జగన్ వెంటే నడుస్తానని ఆమె అన్నారు. వైయస్ జగన్ బిజెపితో దోస్తీ కట్టారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యను ఆమె ఖండించారు. బిజెపితో కలవాల్సిన అవసరం జగన్‌కు లేదని ఆమె చెప్పారు. డి శ్రీనివాస్ దిగజారి మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. తాము గోడ మీది పిల్లులాంటివాళ్లం కాదని, తాము వైయస్ కుటుంబంతోనే ఉంటామని ఆమె చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో పొటా కేసు పెట్టినప్పుడే తాము భయపడలేదని, ఇప్పుడు భయపడే ప్రసక్తి లేదని ఆమె అన్నారు. తెలంగాణకు వ్యతిరేకమని వైయస్ జగన్ ఇప్పటి వరకు చెప్పలేదని, అందువల్ల జగన్ తెలంగాణకు వ్యతిరేకి అనడం సరి కాదని ఆమె అన్నారు.

తన భర్త కొండా మురళికి భద్రత కుదింపుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్నవారిని మానసికంగా హింసించడంలో భాగంగానే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతోందని ఆమె విమర్సించారు. తమ వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు భారీ భద్రత కల్పించిన ప్రభుత్వం తమకు మాత్రం భద్రత కుదిస్తోందని ఆమె అన్నారు. తన భర్త కొండా మురళి ప్రాణాలకు ముప్పు ఉందని, తన భర్తకు ఏమైనా జరిగితే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ప్రభుత్వం వరకు బాధ్యులని ఆమె అన్నారు.

English summary
YSR Congress leader YS Jagan camp Congress MLA Konda Surekha lashed out at Congress. She said that Congress has not right disqualifying her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X