అన్నదమ్ములం కలిసే ఉన్నాం, మాలో విభేదాలు లేవు: చిరంజీవి

Chiranjeevi
కడప: తన సోదరులు తనతో కలిసే ఉన్నారని, అన్నదమ్ముళ్లమంతా ఐక్యంగానే ఉన్నామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. కడపలో కాంగ్రెసు తరఫున పోటీ చేయడానికి వచ్చిన ఆయన బుధవారం సాయంత్రం మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగాకుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయని, కుటుంబం విడిపోయిందని వెలువడ్డ వార్తలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

న తమ్ముల్లు తన కుటుంబం అంతాకలిసే ఉన్నామని, తమ మధ్య ఎటువంటి అంతరాలు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి వార్తలు ప్రసారం చేయడం చూస్తుంటే జర్నలిజం ఎటు ప్రయాణం చేస్తోందో తనకు అర్థకావడం లేదని ఆయన ఆవేధన వ్యక్తంచేశారు. పీఆర్పీ ఎమ్మెల్యేల సంబంధించిన అనర్హతవేటు గురించి రేపు జరగబోయో పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

కడపలో ఆయన కడప పార్లమెంట్‌ అభ్యర్థి డీఎల్ రవీంద్రా రెడ్డి‌,అహ్మదుల్లా, కడప పార్టీ ఇన్‌ఛార్జీ కన్నా లక్ష్మీనారాయణలతో ఆయన సమావేశమై ప్రచారవ్యూహాలపై చర్చించారు. తను ప్రచారం చేసిన చోట ఖచ్చితంగా ఫలితంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన ప్రచారం వల్ల కాంగ్రెసు లాభపడుతుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+