చిరంజీవి ప్రచారం వల్ల వైయస్ జగన్‌కే ఎక్కువ లాభం: రోజా

ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం తప్పదని హెచ్చరించారు. ఉప ఎన్నికలలో జగన్, విజయమ్మ బంపర్ ఆధిక్యంతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ జగన్ ఎమ్మెల్యేలను సామ, ధాన, బేధ, దండోపాయాలతో తన వద్దకు రప్పించుకోవాలని అనుకుంటోందని, అయితే ఎమ్మెల్యేలు అన్నింటికీ సిద్ధమయ్యే జగన్ వెంట నడుస్తున్నారని చెప్పారు. జగన్ గెలుపు ఖాయమని తెలిసినప్పటికీ కాంగ్రెసు మంత్రులను కడపలో మోహరించిందని చెప్పారు. ఓట్ల ద్వారా కాంగ్రెసుకు బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.
జగన్ వర్గ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ముందు కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వైయస్ ఫోటో లేకుండా సోనియా ఫోటోతో గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెసు అవసరానికి అనుగుణంగా ప్లేటు ఫిరాయిస్తుందని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ మాటల్లో, చేతల్లో నైతికత లేదన్నారు. రాజకీయ అక్కసుతోనే జగన్‌ను విమర్శిస్తున్నారని అన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని అయితే పార్టీ ఆదేశిస్తే తప్పదన్నారు. టిడిపిలో టిక్కెట్ ఇచ్చి ఓడించారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications