ఐటీ కారిడార్ వాహనదారులకు తీపికబురు: ఈ కొత్త ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ కష్టాలకు చెక్!

హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ పరిధిలో నివసించే వాహనదారులకు, స్థానిక ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుండి త్వరలోనే పెద్ద ఉపశమనం లభించనుంది. బాచుపల్లి జంక్షన్‌ వద్ద ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 4లైన్ల సరికొత్త ఫ్లైఓవర్ నిర్మాణపనులు పూర్తిస్థాయిలో ముగిసి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, ఆయా రూట్లలో ప్రయాణించే వారికి సిగ్నల్ రహిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

బాచుపల్లి క్రాస్ రోడ్స్ ... ట్రాఫిక్ కష్టాలు

బాచుపల్లి క్రాస్‌రోడ్స్ అనేది నిజాంపేట్, మల్లంపేట్, ప్రగతి నగర్ మరియు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే అత్యంత కీలకమైన కూడలి. ఇక్కడ నిరంతరం వందలాది ఐటీ ఉద్యోగుల వాహనాలతో పాటు భారీ రవాణా వాహనాలు తిరుగుతుండటంతో పీక్ అవర్స్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రాంతంలో ప్రయాణం నరకప్రాయంగా మారేది.

Bachupally Flyover Ready for Grand Inauguration Signal-Free Ride in Hyderabad IT Corridor

దాదాపు 66కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ సమస్యలకు చెక్

ఈ జంక్షన్ గుండా వెళ్లే వాహనదారులు కనీసం 15నుండి 20నిమిషాల పాటు సిగ్నల్స్ వద్ద వేచి ఉండాల్సి వచ్చేది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకే ఈ మేజర్‌ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టారు. ఆధునిక ఇంజినీరింగ్ ప్రమాణాలతో, విశాలమైన లేన్లతో నిర్మించిన దాదాపు 66కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ద్వారా నిజాంపేట్ మరియు మల్లంపేట్ వైపు వెళ్లే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా నేరుగా వెళ్ళే అవకాశం ఉంది.

కొనసాగుతున్న ఫ్లై ఓవర్ కు సంబంధించిన ఫైనల్ వర్క్స్

జంక్షన్ వద్ద కింద నడిచే స్థానిక ట్రాఫిక్ మరియు పైనుంచి వెళ్లే దూరాభార వాహనాల విభజన జరగడం వల్ల ప్రమాదాల తీవ్రత కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం వంతెనకు సంబంధించిన ఫైనల్ వర్క్స్ జరుగుతున్నాయి. రంగులు వేయడం, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు మరియు సైన్ బోర్డుల అమరిక పనులు శరవేగంగా సాగుతున్నాయి.

హైదరాబాద్ మెట్రోలో విండో స్క్రీన్‌పై కాళ్లు పెట్టిన ప్రయాణికుడికి షాక్, కేసు నమోదు, జరిమానా!
హైదరాబాద్ మెట్రోలో విండో స్క్రీన్‌పై కాళ్లు పెట్టిన ప్రయాణికుడికి షాక్, కేసు నమోదు, జరిమానా!

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా,ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారుల సమక్షంలో రూ.65.53 కోట్లతో నిర్మించిన 1.3 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ అధికారికంగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే బాచుపల్లి జంక్షన్‌లో ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+