ఉత్తరాషాడ నక్షత్రంలో దేహం విడిచిన బాబా: ఉదయం 7.28కు మృతి

అయితే భక్తులు ఎవరు కూడా బాబాను చూడటానికి వైద్యశాలకు రాకూడదని వైద్యులు కోరుతున్నారు. బాబా మరణం తెలిసిన భక్తులు భారీగా పుట్టపర్తికి తరలి వస్తున్నారు. బాబా మరణం తెలిసిన ప్రముఖులు కూడా పుట్టపర్తికి తరలి వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేలాదిగా పోలీసులు మోహరించారు. 28 రోజులుగా బాబా ఆసుపత్రిలో ఉన్న అనంతరం బాబా మరణించారు. అయితే బాబా మరణం తెలిసి భక్తులు ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడ కూడదని భక్తులను కోరుతున్నారు. బాబా కేవలం శరీరాన్ని మాత్రమే వదిలి వెళ్లారని, ఆయన ఆత్మ మనతోనే ఉన్నదని అంటున్నారు. బాబా భక్తులు ఈ సమయంలో గుండె ధైర్యం చేసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications