కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు, వైయస్ జగన్ వర్గం మధ్య రాజీనామాల సవాళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
కడప: కడప, పులివెందుల ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న కొద్దీ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఊపందుకుంటున్నాయి. వైయస్ జగన్ వర్గానికి చెందిన నలుగురు శాసనసభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ నేపథ్యంలో రాజీనామాలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు జోరందుకున్నాయి. అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ అన్నారు. రాజీనామా చేసే కాంగ్రెసు పార్టీ నాయకులు సోనియా ఫొటోతో పోటీ చేయాలని, తాము వైయస్సార్ ఫొటో పెట్టుకుని పోటీ చేస్తామని, ఎవరు గెలుస్తారో చూద్దామని ఆయన మంగళవారం మీడియా ప్రతనిధులతో అన్నారు. కడప ఎన్నికల ఫలితాలే కాంగ్రెసుకు సమాధానమిస్తాయని ఆయన అన్నారు.

తమ కాంగ్రెసు తరఫున గెలిచి వైయస్సార్ కాంగ్రెసులో తిరుగుతున్న శాసనసభ్యులు రాజీనామా చేయాలని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలో తిరగడం నైతిక కాదని ఆయన అన్నారు. వైయస్సార్ పథకాలను తాము నిలిపేయలేదని, అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. వరుస ఉప ఎన్నికల వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్‌ను కాంగ్రెసు నుంచి వేరు చేసి చూడలేమని మరో మంత్రి శైలజానాథ్ అన్నారు. కడప ఉప ఎన్నికలో కాంగ్రెసుకు మెజారిటీ లభిస్తుందని ఆయన అన్నారు.

English summary
As campaigning for Kadapa and Pulivendula bypolls picking up, Congress and YSR Congress leaders are criticising each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X