రేపే శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు భేటీలో కీలక నిర్ణయం

సత్య సాయిబాబా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రయోజనం పొందారు. ఆ కార్యక్రమాలను ట్రస్టు సమర్థంగా నిర్వహిస్తుందో, లేదో ఆనే ఆందోళన భక్తులను చుట్టుముడుతోంది. చెక్ పవర్ ఎవరికిస్తారనే విషయంపై కూడా స్పష్టత లేదు. చెక్ పవర్‌ను తాత్కాలికంగా ట్రస్టు కార్యదర్శి చక్రవర్తికి ఇవ్వవచ్చునని ప్రచారం జరుగుతోంది. పూర్తి అధికారాలు సత్యజిత్, ఆర్‌జె రత్నాకర్‌లకు ఉమ్మడిగా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. బాబా తన వారసుడిని ప్రకటించకపోవడంతో ప్రస్తుత గందరగోళం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications