వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరవింద రావుకు క్యాట్ షాక్, నియామకం చెల్లదని తీర్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Aravind Rao
న్యూఢిల్లీ‌: రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) అరవింద రావుకు సెంట్రల్ అడ్మినిష్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) షాక్ ఇచ్చింది. డిజిపిగా అరవింద రావు నియామకం చెల్లదని క్యాట్ బుధవారం తీర్పునిచ్చింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి గౌతం కుమార్ వేసిన పిటిషన్‌పై క్యాట్ ఈ తీర్పు వెలువరించింది. జూన్ 9వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజిపిని నియమించుకోవాలని, అప్పటి వరకు డిజిపిగా అరవింద రావును కొనసాగించాలని ఆదేశించింది.

డిజిపి నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా నిబంధనలు ఉల్లంఘించిందని అభిప్రాయపడింది. 2010 మేలో అరవింద కుమార్‌తో పాటు మరి కొందరికి అదనపు డిజిగా ప్రమోషన్ ఇవ్వడం సరైంది కాదని చెప్పింది. డిజిపి నియామకంలో సీనియారిటీని పాటించకపోవడాన్ని క్యాట్ తప్పు పట్టింది. సీనియారిటీని పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఇష్టం మేరకు డిజిపి నియామకాలు జరగడం ఒక రకంగా ఆనవాయితీగా వస్తోంది.

English summary
CAT dismissed the appoint, emt of Aravind Rao as DGP. It ordered to appoint new DGP before June 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X