ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్దులకు సువర్ణ అవకాశం, ఉచిత సాఫ్ట్‌వేర్

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటోడెస్క్ కంపెనీ త్రీడీ సాఫ్ట్‌వేర్ డిజైనర్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఈ కంపెనీ విద్యారంగంలో సాంకేతికంగా వి ద్యార్ధులను ప్రతిభావంతులుగా చేసేందుకు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలకు ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు ముందుకువచ్చిందని అన్నారు. మొదటి విడతగా రాష్ట్రంలోని వందకాలేజీలలో ఈ సౌకర్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు.
సాంకేతిక విద్యలో మరింత శిక్షణ ఇవ్వడంతోపాటు ఆటోడెస్క్ సర్టిఫికెట్ కూడా అందించనుందని, దీని వల్ల ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. ఈ అవకాశం రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్ధు లకు ఎంతో ఉపయోగమన్నారు. ఈ భేటీలో ఆటోడెస్క్ ఆసికయా పసిఫిక్ సీనియర్ మేనేజర్ జార్జ్‌అబ్రహం, ఇండియా సీనియర్ మేనేజర్ దీపంకర్ భట్టాచార్యతో పాటు రాష్ట్ర జవహర్ నాలెడ్జ్ సెంటర్ సిఈఓ అమర్‌నాధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications