బిజెపి మంత్రి గాలి డైరెక్షన్, వైయస్ జగన్ యాక్షన్: చంద్రబాబు
Districts
oi-Srinivas G
By Srinivas
|
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సూచనలు ఇస్తున్నారని ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కడప జిల్లాలో తన ప్రాచారంలో ధ్వజమెత్తారు. బిజెపి నేత గాలి జనార్ధన్ రెడ్డి డైరెక్షన్‌లో జగన్ యాక్షన్ చేస్తున్నారని దీనిని మైనార్టీలు గుర్తించాలని ఆయన సూచించారు. బిజెపితో కలిసి జగన్ పని చేస్తున్న విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు.
మైనార్టీలకు న్యాయం చేసింది టిడిపి ఒక్కటే అన్నారు. అందరికీ సమ న్యాయం టిడిపి వల్లనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ అసలు పోటీలేనే లేదని చంద్రబాబు అన్నారు. కాంగ్రెసు పార్టీకి ఓటెయడం కూడా దండగ అని కడప జిల్లా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అవినీతి జగన్‌ను ఓడించే శక్తి టిడిపికి మాత్రమే ఉందన్నారు. అందుకే ఇప్పుడు కడప ప్రజలు టిడిపి వైపు చూస్తున్నారని అన్నారు.
TDP president Chandrababu Naidu said today that only Telugudesam will defeat Ex MP YS Jaganmohan Reddy in bypoll. He said voters is thinking that it is waste if they vote to Congress.
Story first published: Friday, April 29, 2011, 10:43 [IST]