చంద్రబాబు కాంగ్రెసులోకి రావాల్సిందే, కుటుంబంలో విభేదాలు: చిరంజీవి

జగన్ అధికార దాహం రాష్ట్ర పాలన వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని చిరంజీవి అన్నారు. ఆ వ్యక్తి స్వార్థం, అధికార దాహమే ఉపఎన్నికలకు కారణమయిందన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని నంది మండలంలో చిరంజీవి పర్యటించారు. ముఖ్యమంత్రి పదవి వంశపారంపర్యంగా వస్తున్న జాగీరు కాదని జగన్‌పై ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2 ఎకరాల పొలం నుంచి 2వేల ఎకరాలు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు.
అన్నా హజారే అవినీతిపై పోరాడుతున్న మహాయోధుడని కొనియాడారు. ఆయన పోరాటం ప్రారంభించి 24 గంటలు గడవకముందే అందరూ ఆయనకు మద్దతు పలకడం సంతోషించదగ్గ విషయం అన్నారు. అవినీతి పరులైన చంద్రబాబు, జగన్ ఆయనకు మద్దతు తెలపడం కంటే పెద్ద జోక్ లేదని చిరు విమర్శించారు.