వైయస్ జగన్‌తో మాకు సంబంధం లేదు: బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

తమ పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించి కడప ఉపఎన్నికల్లో లబ్ధిపొందాలని కొన్ని పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయని ఆ కిషన్‌రెడ్డి విమర్శించారు. కడపలో తమకు తగిన బలం లేకపోవడంతోనే ఎన్నికలకు దూరంగా ఉన్నామని ఆయన తెలిపారు. అంతమాత్రాన తమ పార్టీని కించపర్చే విధంగా మాట్లాడటం సరికాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ముస్లీం, మైనార్టీలంతా తమవైపే ఉన్నారని ప్రేమ ఒలకపోసే కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో డీఎస్ ఎందుకు ఘోరంగా ఓటమి పాలయ్యారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో తమ పార్టీని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన తెదేపా వాస్తవాలను మరచి విమర్శలకు దిగడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.కడప ఎన్నికల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టి, ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications