కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు నెలల క్రితమే జగన్ బిజెపి జాతీయ నేతలను కలిశారు: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు నెలల క్రితమే భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలను కలిశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం కడప జిల్లాలో విమర్శించారు. జగన్ మొత్తానికి తన మనసులోని మాట బయట పెట్టాడని అన్నారు. బిజెపితో కలవనని చెబుతూనే కలిస్తే 10 శాతం రిజర్వేషన్ కోరతానని చెప్పడం ద్వారా పరోక్షంగా కలుస్తానని చెప్పడమే అని అన్నారు. జగన్ వెంట ఉన్న శాసనసభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీకి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు.

సామాజిక న్యాయం పేరుతో పార్టీని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేయడాన్ని నారాయణ తప్పు పట్టారు. పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయడం అనైతికమన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో జరుగుతున్న అధికార దుర్వినియోగం, డబ్బుపంపిణీ రాష్ట్రంలో మరెక్కడా లేదన్నారు.

English summary
CPI Narayana confirmed that Ex MP YS Jaganmohan Reddy met BJP national leaders already. He demanded to resign Jagana camp MLAs. He also accused Chiranjeevi attitude that he merger of PRP in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X