చిక్కుల్లో వైయస్ జగన్, ప్రత్యర్థి పార్టీలను ఆడిపోసుకున్న సాక్షి డైలీ

బిజెపితో పొత్తు ఎంత అసాధ్యమో చెప్పడానికి వైయస్ జగన్ ఆ మాట అన్నారని, ఒక్క వ్యాఖ్యకు తెలుగుదేశం, కాంగ్రెసు, ఎల్లో మీడియా (ఈనాడు) వక్రభాష్యాలు అల్లుతున్నాయని సాక్షి ఆడిపోసుకుంది. దశాబ్దం పాటు బిజెపితో అంట కాగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. జగన్‌పై విమర్శలు చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించింది. బిజెపి అగ్రనేత అద్వానీతో చంద్రబాబు, రామోజీ రావు ఉన్న ఫొటోను వార్తాకథనంలో ప్రచురించింది. బిజెపి మతతత్వాన్ని పక్కన పెట్టి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమా అని సాక్షి ప్రశ్నించింది. మొత్తం మీద, సాక్షి మీడియా వార్తాకథనాన్ని బట్టి వైయస్ జగన్ తన ప్రకటనతో ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications