వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు మద్దతిస్తానని జగన్ అన్నాడు: ఉండవల్లి అరుణ్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి మద్దతిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ చెప్పారని, ఈ విషయం ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆ పత్రిలో వచ్చిన వార్తను ఆయన మీడియా ప్రతినిధులకు చూపించారు. వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇవ్వగానే వైయస్ జగన్ కాంగ్రెసుకు రాజీనామా చేశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి సహకరించానని చెబుకున్న వైయస్ జగన్ తన చిన్నాన్నకు మంత్రి పదవి ఇవ్వగానే రాజీనామా చేయడంలోనే ఉద్దేశం ఏమిటని ఆయన అడిగారు. వైయస్సార్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి పదవి ఇస్తే ఆ కుటుంబం సంతృప్తి చెందుతుందని కాంగ్రెసు అధిష్టానం భావించిందని, అయితే జగన్ సహించకలేకపోయారని ఆయన అన్నారు.

తనపై సాక్షి మీడియాలో వచ్చిన వార్తాకథనంపై ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర ప్రతిస్పందించారు. ఏడాదిన్నర కాంగ్రెసు పార్టీలో ఉన్న వైయస్ జగన్ పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడినప్పుడు 30 ఏళ్లు పార్టీలో ఉన్న తాను మాట్లాడితే తప్పేమిటని ఆయన అడిగారు. తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డికి, చిరంజీవికి వెంటనే సోనియా అపాయింట్‌మెంట్ ఇచ్చారని, వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణికి నెలకు గాని అపాయింట్‌మెంట్ లభించలేదని, అయినా తాను బాధపడలేదని వైయస్ జగన్ అన్నారని, జగనే బాధపడనప్పుడు తాము ఎలా బాధపడుతామని ఆయన అన్నారు.

ఈనాడులో వార్త వస్తే రామోజీ రావు ఫొటో వేసి రాస్తున్నారని, ఈనాడులో వచ్చిన వార్తలకు రామోజీ రావునే బాధ్యులను చేస్తున్నారని, అందువల్ల సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తాకథనాలకు వైయస్ జగన్‌నే బాధ్యుడ్ని చేయడం సరైందని, అందుకే తాను జగన్‌ను బాధ్యుడ్ని చేస్తున్నానని ఆయన చెప్పారు. సాక్షి మీడియాలో వచ్చిన వార్తలకు జగన్‌ను బాధ్యుడ్ని చేయడం నైతికంగా, బాధ్యతగా సరైందేనని ఆయన అన్నారు. పార్టీ పెట్టుకోవడం జగన్ ఇష్టమని, కానీ సోనియాపై విమర్శలు చేస్తే సహించబోమని ఆయన అన్నారు.

English summary
Congress MP Undavalli Arun Kumar lashed out at YSR Congress leader YS Jagan. He condemned Sakshi media reports against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X