న్యాయం కోసం భర్త ఇంటి ముందు ఆందోళన: రెండో భార్యతో భర్త పరార్

అంతేకాకుండా తన భర్త మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నారనే విషయం రమాదేవి దృష్టికి వచ్చింది. దీంతో రమాదేవి తన కొడుకు ప్రశాంత్ మృతదేహంతో భర్త చంద్రశేఖరరాజు ఇంటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తానని చెప్పింది. అయితే రమాదేవి ఇంటి వద్దకు ఆందోళన చేయడానికి వస్తుందనే విషయం తెలుసుకున్న భర్త తన రెండో భార్యతో సహా పరారయినట్లుగా తెలుస్తోంది. తానకు పెళ్లి అయిన నాటి నుండి అత్తింటి వారిలో కష్టాలు ఉన్నాయని రమాదేవి చెబుతోంది. తమ తల్లిదండ్రులు ఇచ్చిన కట్నమే కాకుండా అదనపు కట్నం తెమ్మని వారు చిత్ర హింసలు పెట్టారని చెబుతోంది.












Click it and Unblock the Notifications