బెదిరింపులను పట్టించుకోకుండా బార్కాస్ వెళ్లిన అక్బరునద్దీన్

Akbaruddin Owaisi
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బార్కాస్ రావద్దని మహ్మద్ పహిల్వాన్ ఇంతకు ముందే హెచ్చరించడాని చెబుతున్నారు. మహ్మద్ పహిల్వాన్ బెదిరింపులను పట్టించుకోకుండా బార్కాస్‌లో పాదయాత్రకు మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ వెళ్లినట్లు సమాచారం. బార్కాస్ ప్రాంతం చిన్న చిన్న సందులు, గల్లీలు ఉంటాయి. దీన్ని అవకాశంగా తీసుకుని మహ్మద్ పహిల్వాన్, అతని అనుచరులు అక్బరుద్దీన్‌పై, హైదరాబాద్ మలక్‌పేట శాసనసభ్యుడు అహ్మద్ బిన్ బలాలపై దాడులు చేసినట్లు చెబుతున్నారు.

దుండగులు అక్బరుద్దీన్, బలాలాలపై కత్తులతో దాడి చేసి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఓ బుల్లెట్ అక్బరుద్దీన్ పొట్టలోంచి దూసుకుపోయినట్లు సమాచారం. మరో బుల్లెట్ చాతీ పక్కన నుంచి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. మహ్మద్ పహిల్వాన్ గత ఎన్నికల్లో ఎంబిటికి మద్దతిచ్చాడు. సల్లావుద్దీన్ ఓవైసీకి మద్దతుదారుగా ఉన్న మహ్మద్ ఆయన కుమారులు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలతో విభేదించాడు.

తాజా సంఘటన నేపథ్యంలో హైదరాబాదు పాతబస్తీలోని దుకాణాలన్నీ మూతపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా పాతబస్తీకి అదనపు బలగాలను తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు ఎవరినీ అనుతించడం లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాదులోని సంతోష్ నగర్‌లో గల ఓవైసీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఐసియులో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. పాతబస్తీలో హై అలర్ట్ ప్రకటించారు. ఓవైసీని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+