అక్బరుద్దీన్‌పై దాడి ఘటన: పహిల్వాన్ బావమరిది ఇర్ఫాన్ మృతి

Akbaruddin Owaisi
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ దాడి ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి మరణించాడు. మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన నేపథ్యంలో ఎదురు దాడిలో నలుగురు మహ్మద్ పహిల్వాన్ వర్గానికి చెందిన వ్యక్తులు గాయపడ్డారు. వారిని హైదరాబాదులోని యశోదా ఆస్పత్రికి తరలించారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహ్మద్ పహిల్వాన్ బావమరిది ఇర్ఫాన్ మరణించినట్లు చెబుతున్నారు. అతను కాల్పుల్లో గాయపడ్డాడు.

అక్బరుద్దీన్‌పై దాడి ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాతబస్తీకి పెద్ద యెత్తున పోలీసు బలగాలను తరలించారు. అక్బరుద్దీన్ చికిత్స పొందుతున్న ఓవైసీ ఆస్పత్రి వద్ద మజ్లీస్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. బార్కాస్‌లో ఇరు వర్గాల మధ్య గొడవ తర్వాత ఘర్షణ జరిగిందని, ఈ ఘర్షణలో ఇర్ఫాన్ గాయపడ్డాడని చెబుతున్నారు. అక్బరుద్దీన్‌పై దాడితో తమకు సంబంధం లేదని ఎంబిటి ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+