మజ్లీస్ మాఫియా పార్టీ, వాళ్లే దాడి చేశారు: మహ్మద్ పహిల్వాన్

Akbaruddin Owaisi
హైదరాబాద్: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ గన్‌మెన్‌లే తమ మనుషులపై కాల్పులు జరిపారని కాల్పుల ఘటనకు ప్రధాన కారకుడిగా ప్రచారమైన మహ్మద్‌ పహిల్వాన్‌ తెలిపారు. దాడిని తప్పించుకునేందుకు తమ వాళ్లు ప్రతిఘటించినా ప్రాణాపాయం తప్పలేదన్నారు. సంఘటన జరిగిన సమయంలో తాను అసలు అక్కడ లేనేలేనని, కాల్పులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

మజ్లీస్ మాఫియా పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం మజ్లీస్ కొమ్ము కాస్తోందని ఆయన అన్నారు. అక్బరుద్దీన్ మనుషుల కాల్పుల్లో గాయపడిన తమవారిలో ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. తనను బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తాను పహిల్వాన్‌గిరి చేయడం లేదని, తాను రెజ్లర్‌నని ఆయన చెప్పారు. మజ్లీస్ అక్రమాలను అడ్డుకోవడానికి తాను ప్రయత్నిస్తుండడం వల్లనే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. తనను మజ్లీస్ వైపు తిప్పుకోవడానికి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+