నిలకడగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోగ్యం: సబితా ఇంద్రా రెడ్డి వెల్లడి

Sabitha Indra Reddy
హైదరాబాద్: దాడిలో గాయపడిన మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం నిలకడగా ఉందని హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. అక్బరుద్దీన్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని ఆమె శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అక్బరుద్దీన్ తిరిగి వస్తుండగా దుండగులు కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో అక్బరుద్దీన్ గాయపడ్డారని ఆమె చెప్పారు. దుండగులు కాల్పులు జరిపిన సమయంలో మరో శాసనసభ్యుడు బలాలా గన్‌మెన్ కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారని, ఆ ముగ్గురిలో ఒకతను మరణించాడని ఆమె చెప్పారు.

అక్బరుద్దీన్‌కు అందిస్తున్న చికిత్సను ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అక్బరుద్దీన్‌పై దాడి కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఇందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఆమె చెప్పారు. అక్బరుద్దీన్ కాలేయం, గుండె, ఊపిరితిత్తులకు ఏ విధమైన ప్రమాదం లేదని ఆమె చెప్పారు.

కాగా, మలక్‌పేట శాసనసభ్యుడు బలాలా గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారని, వీరిలో ఒక వ్యక్తి మరణించాడని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని డిజిపి అరవింద రావు చెప్పారు. అయితే, ముగ్గురు కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+