వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒసామా బిన్ లాడెన్ వారసుడు జవహ్రి, ఆల్ ఖైదాకు నాయకత్వం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ayman Al-Zawahri
వాషింగ్టన్: ఈజిప్టులో పుట్టిన వైద్యుడు అయ్‌మాన్ ఆల్ - జవహ్రి ఒసామా బిన్ లాడెన్‌ వారసుడిగా ఆల్ ఖైదాకు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. ఆయన ఆల్ ఖైదాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. లాడెన్ మృతితో ఆతను ఆ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాడెన్ వెనక, ఆల్ ఖైదా వ్యవస్థ వెనక జవహ్రి ఆలోచనలున్నాయి. నాటోకు, లిబియాలోని అమెరికన్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చిన వీడియో గత నెలలో సైట్ (ఎస్ఐటిఇ) నిఘా వర్గాలు సంపాదించాయి.

కైరోలో పండితులకు, వైద్యులకు ఆలవాలమైన ఉన్నత వర్గానికి చెందిన కుటుంబంలో జవహ్రి జన్మించాడు. లాడెన్ తర్వాతి స్థానం ఆల్ ఖైదాలో జవహ్రిదే. ఎఫ్‌బిఐ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో అతని పేరుంది. అయితే, లాడెన్ మరణించాడని చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అతని పేరు కూడా ఎత్తలేదు. బరాక్ ఒబామాపై జవహ్రి ఒకానొక సందర్భంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. బుష్‌కు ఒబామాకు తేడా లేదని ప్రకటించాడు.

English summary
Egyptian-born doctor and surgeon Ayman al-Zawahri is al-Qaida's second-in-command expected to succeed Osama bin Laden following his killing in a firefight with US forces in Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X