వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ మృతి: విదేశాల్లోని తన పౌరులను హెచ్చరించిన అమెరికా

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
వాషింగ్టన్: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మృతి నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ విదేశాల్లోని తమ పౌరులను హెచ్చరించింది. విదేశాల్లోని రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేసింది. లాడెన్‌ను మట్టుబెట్టారనే ఆగ్రహంతో ఆల్ ఖైదా అమెరికా పౌరులపై దాడులు చేసే ప్రమాదం ఉందని తెలిపింది. పాకిస్తాన్‌లో చేపట్టిన ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు పెంచిన నేపథ్యంలో అమెరికాకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు జరగవచ్చునని అభిప్రాయపడింది.

గతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఉన్న, ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్న అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లను విడిచి బయటకు వెళ్లవద్దని తెలిపింది. భారీ సమూహాలకు దూరంగా ఉండాలని కూడా తెలిపింది. అమెరికా రాయబార కార్యాలయాలు తగిన చర్యలు తీసుకుంటాయని చెప్పింది.

English summary
The State Department is putting US embassies on alert and is warning Americans abroad of possible reprisal attacks from al-Qaida and its affiliates around the world after the killing of the group's leader Osama bin Laden by American forces in Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X