కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు: వట్టి వసంత్ కుమార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vatti Vasanth Kumar
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న దారి సరైనది కాదని మంత్రి వట్టి వసంత్ కుమార్ సోమవారం అన్నారు. కాగా ఇన్నాళ్లూ జగన్‌పై స్పందించని వట్టి వసంత కుమార్ స్పందించడం విశేషం. తాను ఇలాంటి మాటలు మాట్లాడవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని తప్పని పరిస్థితుల్లోనే తాను మాట్లాడుతున్నట్టు చెప్పారు. జగన్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు ఉండేదని చెప్పారు. జగన్ కాంగ్రెసులోనే ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవని అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రతిపాదన కొత్తది కాదన్నారు. అది ముందు నుండే ఉందని చెప్పారు. చిరంజీవికి గత సాధారణ ఎన్నికలలో వచ్చిన ఓటింగ్ చూసిన వైయస్ గతంలోనే పిఆర్పీని కాంగ్రెసులో కలుపుకుందామని తనతో చెప్పారని వట్టి చెప్పారు.

చిరంజీవి తాను ముఖ్యమంత్రిని కావాలనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని అన్నారు. జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖరరెడ్డిని కూడా గతంలో చాలామంది కాంగ్రెసును వీడి కొత్త పార్టీ పెట్టమని వైయస్ ముందుకు రాలేదని, కానీ జగన్ మాత్రం కాంగ్రెసును వీడి తప్పు చేశారన్నారు. అయితే ఇటీవల మంత్రి పదవిపై ఏకంగా అధిష్టానం వద్దకే వెళ్లిన వట్టి వసంత్ కుమార్ మాత్రం ఎవరో మాట్లాడిస్తే మాట్లాడాడని చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల ఎవరు మాట్లాడినా అధిష్టానం మాట్లాడిస్తుందనే ఆరోపణలు వచ్చేవి. కానీ వైయస్‌కు సన్నిహితుడు, వైయస్ కుటుంబ హితుడు అయిన వట్టి జగన్‌పై చాలా కాలం తర్వాత నోరు విప్పడం విశేషం.

English summary
Minister Vatti Vasanth Kumar opposing Ex MP YS Jaganmohan Reddy attitude. He said Jagan have great future if he will in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X