టిడిపి మహిళా నేతల గిల్లికజ్జాలు: నచ్చజెప్పిన శోభా హైమావతి

Telugudesam
కడప: ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ మహిళా నేతలు ధాటిగా ప్రచారంలో దూసుకు పోతుంటే తెలుగుదేశం పార్టీ మహిళా నేతలకు మాత్రం గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఉప ఎన్నికలలో ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు కడప జిల్లాకు తరలి వెళ్లారు. అయితే టిడిపి రాష్ట్ర మహిళా నేత ఒకరు తనను అవమానపరిచారంటూ కడప జిల్లా పార్టీ అధ్యక్షురాలు కుసుమకుమారి రాష్ట్ర మహిళా నేతలతో వాదులాటకు దిగినట్లుగా తెలుస్తోంది.

అయితే పరిస్థితి గమనించిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి కుసుమ కుమారికి నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగిందంట. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని కుసుమకు నచ్చజెప్పడంతో పాటు అటు మహిళా రాష్ట్ర నేతను కూడా సముదాయించి మనకు ప్రచారం ముఖ్యమని చెప్పిందంట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+