కాంగ్రెసు నిర్లక్ష్యం చేస్తే వైయస్ జగన్ బలపడుతాడు: జీవన్‌ రెడ్డి

Jeevan Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకున్నా, ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల తర్వాత మరింత కాలాయాపన చేసినా ఆ లోటును మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బుధవారం అనుమానం వ్యక్తం చేశారు. యుపిఏ తెలంగాణ ప్రకటించకుంటే తెలంగాణలో జగన్ బలపడే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేమే అని చెబుతున్నామని ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రకటించకుంటే పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రకటిస్తే మాత్రం మొదటి స్థానంలో ఉంటుందన్నారు. ఉప ఎన్నికల అనంతరం తెలంగాణపై కేంద్రం తేల్చకుంటే ఆ తర్వాత మేం పార్టీలో ఉంటే ప్రజలు మమ్మల్ని క్షమించరని అన్నారు.

తెలంగాణ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదని, ప్రజల ఆకాంక్ష అన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వడానికి కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెసులో కలపడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. టిఆర్ఎస్‌ను కాంగ్రెసులో కలపాలా లేదా అనేది ఆయనకు సంబంధించిన విషయం అన్నారు. ఓ ప్రాంతీయ పార్టీతో తెలంగాణ అంశం ముడివడి లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం ఓ ప్రాంతానికి ఉపకరించే పోలవరంపై కాకుండా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై దృష్టి సారించాలని హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+