ప్రియుడు మోసం చేశాడని పోలీసులు స్టేషన్ ఎదుట నర్స్ ఆత్మహత్య

ఇంటర్మీడియట్ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటున్న సత్యనారాయణ అనే యువకుడు తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని దుంగ లక్ష్మి అనే నర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా ఆమె మాడుగుల పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. అయితే సత్యనారాయణకు కౌన్సెలింగ్ చేస్తున్నామని చెబుతూ వచ్చారు. బుధవారం కూడా సత్యనారాయణను పోలీసులు పిలిపించి మాట్లాడారు. తనపై కేసు నమోదు చేసుకోవచ్చునని, తాను మాత్రం దుంగ లక్ష్మిని పెళ్లిని చేసుకోనని కచ్చితంగా చెప్పాడు.
సత్యనారాయణ పెళ్లికి నిరాకరించడంతో కేసు పెట్టేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. ఫిర్యాదుపై సంతకం చేయాలని పోలీసులు దుంగ లక్ష్మికి చెప్పారు. తనకు పెళ్లి కావాల్సిందేనని చెబుతూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. దుంగ లక్ష్మి నర్సింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది.












Click it and Unblock the Notifications