చైనాలో యూట్యూబ్‌కు బదులు వీడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్ యోకు

దీనికోసం చైనాలో ఉన్నటువంటి యోకు ఫౌండర్ విక్టర్ కో ఆపిల్ కంపెనీ సిఈవో స్టీవ్ జాబ్స్‌ని కలిసినట్లు రూమర్ వచ్చింది. యోకు ఫౌండర్ విక్టర్ కో, స్టీవ్ జాబ్స్‌ని కలవడానికి ముఖ్యకారణం ఏమిటంటే చైనాలో అఫీసియల్‌గా విడుదల చేసినటువంటి ఆపిల్ డివైజెస్‌లలో యూట్యూబ్ లేదు కాబట్టి చైనా ప్రోడక్టు అయినటువంటి యోకు అప్లికేషన్ ప్రీ-ఇన్‌స్టాల్‌గా చేయమని కోరడం జరిగిందని సమాచారం.
ఇక యోకు విషయానికి వస్తే చైనాలో ఉన్నటువంటి టాప్ వీడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్స్‌లలో ఇది ఒకటి. అంతేకాకుండా యూజర్స్ ఇందులోకి వీడియోలను అప్ లోడ్ చెయ్యడం కోసం 1500 లైసెన్సు హొల్డర్స్ ఉన్నారని, అంతేకాకుండా ఇందులో టెలివిజన్ స్టేషన్స్, డిస్టిబ్యూటర్స్, ఫిల్మ్, టివి ప్రోడక్షన్ కంపెనీలు చాలా వాటికి ఈ వెబ్‌సైట్‌లోకి వీడియోలు అప్ లోడ్ చేసే వెసులుబాటు ఉంది. కొన్ని యోకు వీడియోలను ఇంటర్నేషనల్ లైసెన్స్ ప్రాబ్లమ్ వల్ల బ్లాక్ చెయ్యడం జరిగింది.
ఈ ఒప్పందానికి గనుక ఆపిల్ కంపెనీ గనుక ఒప్పుకున్నట్లైతే చైనా ఫేమస్ సెర్చ్ ఇంజన్ బైదు మాదిరే ఇది కూడా బాగా పాపులర్ అవుతుందని యోకు ఫౌండర్ విక్టర్ కో అభిప్రాయం.