కనిమొళి బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం 14వ తేదీకి వాయిదా

2జి స్పెక్ట్రమ్ స్కామ్‌తో డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి ప్రత్యక్ష సంబంధం ఉందని సిబిఐ వాదించింది. ముందస్తు బెయిల్ కోసం కనిమొళి పెట్టుకున్న దరఖాస్తుపై సిబిఐ కోర్టులో శనివారం వాదనలు జరిగాయి. కనిమొళి టెలికం మాజీ మంత్రి, స్కామ్ నిందితుడు ఎ. రాజాను కనిమొళి సంప్రదించేవారని చెప్పింది. కలైంగర్ టీవీని నియంత్రించే ప్రధాన వ్యక్తి కనిమొళి అని చెప్పింది. కలైంగర్ టీవీ రూపకల్పనలో కనిమొళిది ప్రధాన పాత్ర అని చెప్పింది. లెక్కాపత్రం లేకుండా 214 కోట్ల రూపాయలను కలైంగర్ టీవీకి బదలాయించారని ఆరోపించింది.
తనను అరెస్టు చేస్తారా అనేది తనకు తెలియదని కనిమొళి అన్నారు. పాటియాలా హౌస్ కోర్టు ఆవరణలో ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కనిమొళి తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ వాదిస్తున్నారు. కలైంగర్ టీవీకి డబ్బులు బదిలీ అయిన వ్యవహారంలో కనిమొళికి సంబంధం లేదని జెత్మాలనీ అన్నారు. కనిమొళి ఏ విధమైన నేరం చేయలేదని, ఆమె టీవీ చానెల్ వాటాదారు మాత్రమేనని చెప్పారు. కుట్ర పాత్రధారి రాజా మాత్రమేనని, కనిమొళి కారని ఆయన అన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కనిమొళి కోర్టుకు హాజరయ్యారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications