కుటుంబ కలహాల కారణంగా నడిరోడ్డుపై భార్య గొంతు కోసిన భర్త

అయితే కత్తితో భార్య గొంతు కోసిన గోవింద్‌ను వెంటనే పోలీసులు స్థానికుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల క్రితం పెళ్లయింది. అయితే తరుచూ వీరి మధ్య గొడవలు జరుగుతాయని చెబుతున్నారు. గోవిందు మద్యం తాగి వచ్చి కల్యాణిని నిత్యం వేధిస్తుంటారని చెబుతున్నారు. అయితే భర్త గొడవలు భరించలేక కల్యాణి స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. ఆ కేసును విత్ డ్రా చేసుకొమని భర్త వేధించాడని తెలుస్తోంది. అది కాస్త ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది.












Click it and Unblock the Notifications