హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలిట్ బ్యురో సమావేశంలో నాగంపై చర్చ, సమన్వయ కమిటీ ఏర్పాటు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం విషయంలో పార్టీతో కలిసి వెళ్లకుండా తనదైన శైలిలో వెళుతున్న టిడిపి సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డిపై ఈ నెల 12న జరిగే పోలిట్ బ్యూరోలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై పార్టీలోని తెలంగాణ నేతలతో కలిసి వెళ్లకుండా తనొక్కడికే క్రెడిట్ దక్కాలన్న భావనతో నాగం వెళుతున్నారని ఇది సరికాదని పార్టీ భావిస్తోంది. ఆయన తన వ్యాఖ్యలతో పార్టీతో పాటు పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని కూడా ఇరుకున పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన చంద్రబాబును జగన్‌తో పోల్చారు. ఇక పార్టీని, పార్టీ నేతలను పూర్తిగా ఇరుకున పెడుతున్నారు.

ఇలాంటి సమయంలో 12న జరగబోయే పోలిట్ బ్యూరో సమావేశంలో నాగం వ్యవహార శైలిపై చర్చించనున్నట్టుగా సమాచారం. ఆయనపై చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో పార్టీ అధినేత వెనుకాడుతున్నారు. అదే రోజున తెలంగాణ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని టిడిపి తరఫున ప్రజలలోకి తీసుకు వెళ్లిన తర్వాత నాగంపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా 12న తెలంగాణ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఒక్కో జిల్లా నుండి ఒక్కో వ్యక్తిని సభ్యుడిగా నియమిస్తారు. అయితే కన్వీనర్‌గా మాత్రం ఎవరినీ పెట్టే అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ, నాగం వ్యవహార శైలితో పాటు మరికొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉంది.

English summary
TDP will talk about MLA Nagam Janardhan Reddy attitude in politburo meeting which will held on 12th of may.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X