భార్యను చంపిన కసాయి భర్త, ఆడపిల్లలనే కంటున్నందుకు దారుణం

ఆడపిల్లలకు జన్మనిస్తున్న భార్యపై సూరిబాబు తరుచూ గొడవ పడుతున్నాడు. ఇరుగు పొరుగువారు నచ్చ చెప్పినా వినలేదు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆ గొడవ తర్వాత శనివారం తెల్లవారు జామున సూరిబాబు భార్య ముఖంపై దిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చీరను కట్టి శవాన్ని వేలాడదీసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. పరారీలో ఉన్న సూరిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications