వైయస్ జగన్ విజయం తెలంగాణకు మంచిదైంది: జూపల్లి కృష్ణారావు

Jupalli Krishna Rao
మహబూబ్‌నగర్: కడప ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విజయం తెలంగాణకు మంచి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణా రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. వైయస్ జగన్ విజయం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సులభమైందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ వచ్చే వరకు తాను మంత్రి పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోబోనని చెప్పారు.

జూన్ 1వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణకు చెందిన మంత్రులు, శానససభ్యులు రాజీనామా చేయాలని, రాజీనామాలు చేయకపోతే ప్రజలు ద్రోహులుగా పరిగణిస్తారని ఆయన అన్నారు. 14ఎఫ్‌ను సవరించిన తర్వాతనే ఎస్సై రాత పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిది మాటల పోరాటమని, తమది ప్రత్యక్ష పోరాటమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+