తెలంగాణ జెఎసి నేతలపై తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు చిందులు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ జెఎసి నేతలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చిందులు తొక్కారు. తెలంగాణ జెఎసి నేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన తెలంగాణ నగారా సభకు జెఎసి నాయకులు వెళ్లడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. తెలంగాణ ఏం చేశారని నాగం జనార్దన్ రెడ్డి సభకు వెళ్లారని ఆయన అడిగారు. శనివారం సాయంత్రం జరిగిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ జెఎసి కార్యలయాన్ని తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు క్వార్టర్ నుంచి మార్చాలని, తెలంగాణపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న నారా చంద్రబాబు నాయుడి కింద పనిచేస్తున్న తెలుగుదేశం నాయకుడి క్వార్టర్‌లో జెఎసి కార్యాలయం ఉండడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసిని ఏర్పాటు చేసింది తానే అని, జెఎసి కార్యాలయాన్ని వేరే చోట పెట్టాలని, అద్దె డబ్బులు తాను చెల్లిస్తానని ఆయన అన్నారు. తనపై విమర్సలు ఎందుకు తిప్పి కొట్టడం లేదని ఆయన తెలంగాణ జెఎసి నేతలను అడిగారు.

జూన్ 1వ తేదీ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. గ్రామాలకు వస్తే తెలుగుదేశం నాయకులను అడ్డుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం ఆయన వివిధ ఉద్యమ కార్యక్రమాలను ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+