బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఓటమి బాధించింది: వైయస్ జగన్

ఎన్నికలకు సిద్దం కావాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఆయన సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో విజయం పాలు పొంగులాంటిదని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని, తాను సవాల్ చేస్తున్నానని, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. తాను తన తండ్రి ఫొటో పెట్టుకుని ఎన్నికల్లోకి దిగుతానని, కాంగ్రెసు సోనియా, రాహుల్ గాంధీల ఫొటోలు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన అన్నారు.
సోనియా గాంధీ మాటకు తాను అంగీకరిస్తే రాజకీయంగా తాను ఎంతో ఎత్తులో ఉండేవాడినని, అయితే విశ్వసనీయత, వ్యక్తిత్వం, సమగ్రత ప్రశ్నలు తలెత్తాయని, దాంతో తాను ఆత్మగౌరవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానని, విశ్వసనీయతను నమ్ముకున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications