సామాన్యుడి నెత్తిన భారం: రూ.5 పెరిగిన పెట్రోలు ధరలు

గతంలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి లీటరు పెట్రోలు ధర ఐదు రూపాయలు పెంచారు. దీంతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.63.37కు చేరుకుంది. రాష్ట్ర రాజధానిలో రూ.71లను తాకింది. శనివారం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇది ఇంతటితో ఆగేలా లేదు! ముందుంది... మొసళ్ల పండగ! అతి త్వరలోనూ డీజిల్‌పై రూ.4, వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.20 నుంచి 25 వరకు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోలుపైనా మరో విడత వడ్డన ఖాయంగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications