114 ఏళ్ల వయస్సులో గిన్నిస్ రికార్డు నెలకొల్పిన బ్రెజిల్ బామ్మ

Maria Gomes Valentim
ఈ అవ్వకు జస్ట్ 114 ఏళ్లు మాత్రమే. ఈమె ప్రత్యేకత అంటంటే.. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా జీవిస్తున్న అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ బుక్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈమెను అధికారికంగా గుర్తించి ఈమె పేరుతో ఓ రికార్డును కూడా నమోదు చేసింది. 'మరియా గోమ్స్ వాలెంటిమ్' అనే బ్రెజిలియన్ బామ్మ గిన్నిస్ తనిఖీ చేసిన వివరాల ప్రకారం జులై 9, 1896లో మినాస్ గెరైస్ స్టేట్‌లోని కరన్గోలాలో జన్మించింది. ఇంత ఎక్కువ కాల జీవించి ఉండటానికి ఆమె తీసుకుంటున్న డైట్ ఆహారమే కారణమని ఈ బామ్మ బంధువులు చెబుతున్నారు. ఒక బ్రెడ్ రోల్, ఓ కప్పు కాఫీ మరియు పండ్లను ఈ బామ్మ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటుందట.

ప్రస్తుతం వాలెంటిమ్ వయస్సు 114 ఏళ్ల 313 రోజులు, ఇంతకు ముందు అధిక కాలం జీవించి ఉన్న వృద్ధ వ్యక్తి రికార్డు నెలకొల్పిన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని మోన్రేకు చెందిన బెస్సీ కూపర్ కన్నా ఆ బామ్మ 48 రోజులు పెద్దది. ఇతరుల జీవితం కన్నా తన సొంత జీవితం పట్లే ఆమె ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం వల్లే ఇంత ఎక్కువ కాలం జీవించగలిగిందని వాలెంటిమ్ మనవరాలు (63 ఏళ్లు) స్థానిక వార్తా పత్రికకు వెల్లడించింది. వాలెంటిమ్ ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంగానే ఉంది.

ఓ పూర్తి గ్లాసు వైన్‌ను సునాయాసంగా తాగేస్తుంది. ఇంకా ఆమెకు వేడి వేడి సాస్‌తో చికెన్ పేస్ట్రీలు తినడమన్నా, అలాగే బ్రెజిలియన్ జాతీయ వంటకమైన ఫీజోడా (బీన్స్ అండ్ సాల్టెడ్ పోర్క్)లంటే ఇష్టమట. వాలెంటిమ్ భర్త జొవావో తనను పెళ్లి చేసుకున్న 33 ఏళ్లకే మరణించాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు, నలుగురు మనవరాళ్లు, ఏడుగురు ముని-మనవరాళ్లు, ఐదుగురు ముని-ముని-మనవరాళ్లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+