చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్, కాంగ్రెసుతో కుమ్మక్కని ఆరోపణ

చంద్రబాబు నాయుడు 47 మంది శానససభ్యులతో 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని, ఇప్పుడు 90 మంది శానససభ్యులున్నా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు రావడం లేదని, ఇదే కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని చెప్పడానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పట్టని ప్రస్తుత ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications